మహిళలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ సత్య శారద
తెలంగాణ
/
వరంగల్
వరంగల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ప్రకృతిని ఆరాధిస్తూ, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు మహిళల ఐకమత్యానికి, ఆత్మీయతకు నిదర్శనమని తెలిపారు.
బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలను నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే ఈ పండుగను మహిళలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు.
బతుకమ్మ వేడుకల విశిష్టతను ప్రతిబింబించేలా పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహిళలు, ప్రజలు పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటాలని ఆమె ఆకాంక్షించారు.