పైపులైన్ పనులతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం మునగాల కృష్ణాపురం గ్రామంలో జవహర్ ఎత్తిపోతల పథకం పైపులైన్ పనుల కారణంగా నష్టపోయిన పత్తి రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు పైపులైన్ నిర్వాహకులు తెలిపారు.
వంగవీడు నుంచి ఎర్రుపాలెం వరకు నిర్మిస్తున్న పైపులైన్ మరమ్మతు పనుల్లో భాగంగా పంటలు నష్టపోయిన ప్రాంతాలను ఆదివారం అధికారులు, నిర్వాహకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన పత్తి పంటలను పరిశీలించి పరిహారం అందించే విషయాన్ని రైతులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, గ్రామ సర్పంచ్ భూక్య నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ కొత్తపల్లి నరసింహారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు పోచేపల్లి శంకర్రావు, కర్నాటి రామ్మోహన్‌రావు, జేఈ మహేష్, ఈజేఈ శివసాగర్, పీవీఆర్ ఏజీఎం విజయభాస్కర్, పీవీఆర్ కంపెనీ నిర్వాహకులు భాషా, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామంలో పైపులైన్ పనుల వల్ల నష్టపోయిన మిగిలిన రైతులకు కూడా పరిహారం అందేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కర్నాటి రామారావు కోరారు.