BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుక్కర్‌లో అన్నం ఉడకలేదని వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 07:34 PM
35 వీక్షణలు

వినయోగదారుల కమిషన్ ను ఆశ్రయించిన మహిళ.. రూ.37,755 చెల్లించాలని ఆదేశం!

విశాఖపట్నం: కొనుగోలు చేసిన ప్రెజర్ కుక్కర్‌లో అన్నం, పప్పు సరిగా ఉడకకపోవడంతో ఓ మహిళ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందారు. కేవలం రూ.1,755 విలువైన కుక్కర్ కొనుగోలుతో మొదలైన వివాదం చివరకు దుకాణం, డీలర్‌కు ఆర్థిక జరిమానా విధించే వరకు వెళ్లింది. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ రూ.1,755 చెల్లించి 4 లీటర్ల ప్రెజర్ కుక్కర్ కొనుగోలు చేశారు. అయితే అందులో అన్నం వండేందుకు ప్రయత్నించగా మూడు, నాలుగు విజిల్స్ వచ్చినప్పటికీ అన్నం పూర్తిగా ఉడకలేదు. మరుసటి రోజు పప్పు వండినా ఇదే సమస్య ఎదురైంది. దీంతో కుక్కర్‌ను మార్చి ఇవ్వాలని దుకాణాన్ని కోరారు. అయితే సర్వీస్ కేంద్రానికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. వయస్సు, శారీరక ఇబ్బందుల కారణంగా సర్వీస్ కేంద్రానికి వెళ్లడం సాధ్యం కాదని ఆమె చెప్పినా దుకాణం నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కుక్కర్‌లో ఎలాంటి లోపం లేదని, సర్వీస్ సిబ్బంది పరీక్షించినప్పుడు సమస్య గుర్తించలేదని దుకాణం, డీలర్ తరఫున వాదించారు. అయితే వారంటీ నిబంధనలకు సంబంధించిన ఆధారాలను సమర్పించడంలో సంబంధిత సంస్థలు విఫలమయ్యాయి. కుక్కర్‌లో లోపం లేదని చెబుతూనే గుడ్‌విల్ పేరుతో దానిని మార్చేందుకు ఎందుకు సిద్ధపడ్డారని కమిషన్ ప్రశ్నించింది. మహిళకు రూ.16,755 చెల్లించాలని ఆదేశం వినియోగదారుల కమిషన్ మహిళకు కుక్కర్ ధర రూ.1,755 తిరిగి చెల్లించడంతో పాటు సేవల్లో లోపానికి పరిహారంగా రూ.12,000, న్యాయపోరాట ఖర్చుల కింద రూ.3,000 చెల్లించాలని ఆదేశించింది. దీంతో బాధితురాలికి మొత్తం రూ.16,755 అందనుంది. అదనంగా దుకాణం, డీలర్‌కు కలిపి మరో రూ.21,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. వినియోగదారుల హక్కులపై కీలక సందేశం వినియోగదారుల రక్షణ చట్టం-2019లోని సెక్షన్ 39 ప్రకారం వస్తువులో లోపం లేదా సేవల్లో లోపం ఉన్నట్లు నిర్ధారణ అయితే వస్తువు ధర తిరిగి చెల్లించడం, మార్పిడి చేయడం, లోపాన్ని సరిచేయడం, పరిహారం అందించడం వంటి ఆదేశాలు జారీ చేసే అధికారం వినియోగదారుల కమిషన్‌కు ఉంది. వినియోగదారుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం కూడా పరిస్థితులను బట్టి సేవల్లో లోపంగా పరిగణించే అవకాశం ఉంది. వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. వారంటీ పత్రాలు, కొనుగోలు రసీదులు భద్రపరచుకోవాలి. వస్తువులో లోపం గుర్తిస్తే సంబంధిత సంస్థకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. సర్వీస్ నివేదికలు, మరమ్మతుల బిల్లులను కూడా భద్రపరచుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 1915ను సంప్రదించవచ్చు. వస్తువు ధర తక్కువగా ఉందని వినియోగదారుడి హక్కుల విలువ తగ్గదు. సరైన ఆధారాలతో చట్టబద్ధంగా పోరాడితే చిన్న మొత్తానికి సంబంధించిన వివాదంలోనూ న్యాయం పొందవచ్చని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.