చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలపై ఆందోళన
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
చీమకుర్తి: గ్రానైట్ క్వారీల్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మిడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదాన్ని 17 ఏళ్ల క్రితం జరిగిన ఘటనతో స్థానికులు గుర్తు చేసుకున్నారు.
అప్పటి ప్రమాదంలో రాళ్ల కింద చిక్కుకున్న కార్మికుల మృతదేహాలను వెలికితీయడానికి సుమారు వారం రోజుల సమయం పట్టిందని స్థానికులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసే సమయానికి అవి దెబ్బతిని దుర్వాసన వచ్చినట్లు అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
తాజా ఘటన నేపథ్యంలో క్వారీల్లో భద్రతా ప్రమాణాల అమలు, కార్మికుల రక్షణ చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.