ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
నారాయణపూర్
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల రాములు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల సంస్థాన్ నారాయణపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎర్రోళ్ల రాములు మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాములు మృతి కాంగ్రెస్ పార్టీకి, ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బద్దుల మురళీ యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పరగోని యాదయ్య, రాచకొండ రమేష్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.