చింతలపూడిలో రూ.2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
మెరక వీధి, ఆర్కే నగర్‌లో నూతన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం 14 రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించగా, ఇప్పటికే 12 రోడ్ల పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా మెరక వీధి, ఆర్కే నగర్‌లో నిర్మించిన రెండు నూతన సీసీ రోడ్లను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు.
కొత్త రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగర పంచాయతీ పరిధిలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన పనులు పూర్తయితే స్థానికులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.