BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెట్టగుట్ట ఆలయ అభివృద్ధికి సహకరించండి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 09:23 PM
6 వీక్షణలు

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు వినతి

ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 10: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం మెట్టగుట్ట దేవస్థాన అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ దేవస్థాన చైర్మన్ పంది వెంకట్రావు శనివారం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయంలో అసంపూర్తిగా ఉన్న కల్యాణ మండపం నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నుంచి నిధులు సమకూర్చాలని కోరారు. ఆలయం చుట్టూ భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు రహదారి నిర్మించాలని, తిరువూరు–రాజవరం ప్రధాన రహదారి నుంచి దేవాలయం వరకు తారు రోడ్డు నిర్మాణానికి రహదారులు, భవనాల శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కల్యాణ మండపంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా సింగిల్‌ ఫేజ్ నియంత్రిక ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రధాన అర్చకులకు ప్రతినెలా గౌరవ వేతనం చెల్లించేందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

దేవస్థానానికి తగిన ఆర్థిక వనరులు లేక అభివృద్ధి పనులు చేపట్టడం ఇబ్బందిగా మారిందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తితిదే ద్వారా లేదా ప్రభుత్వ నిధుల నుంచి తగిన ఆర్థిక సహాయం అందించాలని పంది వెంకట్రావు ఎమ్మెల్యేను కోరారు.