BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 08:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పంటలు ఎండిపోతున్నాయి.. చెరువుల్లోకి గోదావరి జలాలు విడుదల చేయాలి

తెలంగాణ
/ జనగామ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Oct, 2026 - 08:59 PM
5 వీక్షణలు

జనగామ: చెరువుల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే గోదావరి జలాలను విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వడ్లకొండ, పెద్దపహాడ్ గ్రామాల రైతులు శుక్రవారం జనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.

చెరువుల్లో నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు వృథా అవుతున్నాయని ఆందోళన చెందారు. తమ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి చెరువుల్లోకి గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిరసనలో భాగంగా రైతులు పురుగుమందు డబ్బాలు, ఎండిపోయిన గడ్డితో ఆందోళన చేపట్టారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ, పరిష్కారం చూపాలని పోలీసుల కాళ్లు మొక్కి వేడుకున్నారు.

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ధర్నాతో జనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.