BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 06:55 pm
Posted by : కూనురు మధు

తక్కువ నీటితో పంటలు సాగు చేయాలి: వ్యవసాయ అధికారి గిరిబాబు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Oct, 2026 - 06:55 PM
6 వీక్షణలు

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు వ్యవసాయ అధికారి సూచన

చిట్యాల: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్‌లో రైతులు అధిక నీటి అవసరం ఉన్న వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు. ఈ మేరకు మండలంలోని విత్తన డీలర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) ప్రతినిధులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం మరింత బలపడితే భూగర్భ జలమట్టాలు పడిపోయి బోర్లలో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నందున వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే పరిస్థితులు ఉండవచ్చని తెలిపారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు జొన్న, పెసర, మినుము, నువ్వులు, స్వల్పకాలిక కూరగాయలు తదితర తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. వీలైనంత వరకు వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలని కోరారు.

దొడ్డు రకాల వరి విత్తనాలు విక్రయించొద్దు

యాసంగి సీజన్‌లో రైతులకు దొడ్డు రకాల వరి విత్తనాలను విక్రయించకుండా విత్తన డీలర్లు సహకరించాలని వ్యవసాయ అధికారి సూచించారు. వరి సాగుకు సరిపడా నీటి వసతి ఉన్న రైతులు సైతం అధిక కాలం పట్టే దొడ్డు రకాల కంటే స్వల్పకాలంలో దిగుబడి వచ్చే సన్న రకాలను పరిమిత విస్తీర్ణంలో సాగు చేయాలని సూచించారు.

వరి విత్తనాల్లో కేఎన్‌ఎం-1638, తెలంగాణ సోనా వంటి సన్న రకాలను మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాలు తమ సభ్య రైతులను ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సహించి, ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని గిరిబాబు కోరారు. ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను సింగిల్ విండో కార్యాలయాలతో పాటు ప్రైవేట్ విత్తన డీలర్ల వద్ద అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎలిమినేడు పీఏసీఎస్ చైర్మన్ రఘుమారెడ్డి, నేరడ, వింబావి ఎఫ్‌పీఓల డైరెక్టర్ అవిశెట్టి శంకరయ్య, సీఈవోలు నాగరాజు, హరికృష్ణ, ఏటీఎంఏ సభ్యుడు లింగారెడ్డి, వేరుపల్లి ఎఫ్‌పీఓ ప్రతినిధి రమేష్‌తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రైవేట్ విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.