డ్యాన్సర్ల అసోసియేషన్ కార్యవర్గం రద్దు.. అక్టోబర్ 11న ఎన్నికలు
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: డ్యాన్సర్ల అసోసియేషన్‌కు సంబంధించిన కార్యవర్గాన్ని ఫిలిం ఫెడరేషన్ రద్దు చేసినట్లు సమాచారం. ఈ అంశంపై సుమలత, రఘు మాస్టర్‌తో ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.
సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో సుమలతకు 11 మంది డ్యాన్సర్లు, రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతు తెలిపినట్లు సమాచారం.
అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల నిర్వహణ, తదుపరి కార్యవర్గం ఏర్పాటు వంటి అంశాలపై ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.