దాండియా, బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలి: రూపిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ: దాండియా, బతుకమ్మ వేడుకలను హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలని హిందూ వాహిని రాష్ట్ర కోఆర్డినేటర్ రూపిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి కోరారు. హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పండుగల సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కాపాడేలా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.
పండుగల నిర్వహణలో శాంతిభద్రతలను పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలను నిర్వహించాలని రూపిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి సూచించారు.