BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో రూ.12.05 కోట్లతో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 03:27 PM
2 వీక్షణలు

చనుబండలో రూ.1.93 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన

నూజివీడు/చాట్రాయి, అక్టోబరు 10: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండల గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12.05 కోట్లతో పలు పనులు మంజూరు చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో గ్రామాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు తాగునీటి సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు కేటాయించారు.

సూరవరం గ్రామంలో అభివృద్ధి పనులు

సూరవరం గ్రామంలో ప్రధాన రహదారి నుంచి గౌడ బజారు వరకు 264 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.24 లక్షలు కేటాయించారు. అదేవిధంగా తాగునీటి సరఫరా కోసం మోటారు ఏర్పాటుకు రూ.26 వేలు మంజూరు చేశారు. దీంతో గ్రామంలో రాకపోకలకు, తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చనుబండలో రోడ్డు, తాగునీటి సదుపాయాలు

చనుబండ గ్రామంలోని కాపులవీధిలో 183 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, తాగునీటి పైపులైన్ ఏర్పాటుకు రూ.2 లక్షలు కేటాయించారు. వీటితో పాటు గ్రామంలో రూ.1.93 కోట్ల అంచనా వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేపడుతున్నారు. గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలగనుంది.

పోతనపల్లిలో రూ.3 కోట్లతో సీసీ రోడ్డు

పోతనపల్లి గ్రామంలో 1.7 కిలోమీటర్ల పొడవున రూ.3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే గ్రామస్థులతో పాటు రైతులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రహదారితో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల ప్రగతికి దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సమస్యలు పరిష్కారమవుతున్నాయని గ్రామస్థుల హర్షం

సూరవరం గ్రామానికి చెందిన సుబ్బారావు, రత్తయ్య మాట్లాడుతూ తమ గ్రామంలో గత 20 ఏళ్లుగా రోడ్డు, తాగునీటి మోటారు సమస్యలు ఉన్నాయని తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి గ్రామానికి వచ్చినప్పుడు ఈ సమస్యలను వివరించగా, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ప్రస్తుతం పనులు మంజూరు కావడంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

చనుబండ గ్రామానికి చెందిన సీహెచ్. సావిత్రి మాట్లాడుతూ తమ వీధిలో సరైన రోడ్డు లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవని, తాగునీటి సమస్య కూడా ఉండేదని తెలిపారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కొద్ది రోజులకే రోడ్డు, తాగునీటి సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

గ్రామంలోనే వైద్యం అందుబాటులోకి రావడంపై ఆనందం

చనుబండలో రూ.1.93 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఎం. శ్రీనివాస్, పి. వెంకటేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు గ్రామంలో ఆసుపత్రి లేక జ్వరం వచ్చినా, పాముకాటు లేదా కుక్కకాటు వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా మెరుగైన వైద్యం కోసం చాట్రాయి, విస్సన్నపేట ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు సకాలంలో వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

రోడ్డు నిర్మాణంతో గ్రామానికి కొత్త రూపు

పోతనపల్లి గ్రామంలోని చిన్న తండాకు చెందిన డి. వెంకటేశ్వరరావు, డి. లక్ష్మి తదితరులు మాట్లాడుతూ తమ చిన్నప్పటి నుంచి సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారి సరిగా లేక పిల్లలు, రైతులు రాకపోకల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. ప్రస్తుతం సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ, వీధి దీపాల వంటి సదుపాయాలు మెరుగుపడుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు.

చాట్రాయి మండలంలోని గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, వైద్య సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న పనులు పూర్తయితే ప్రజల దైనందిన జీవనంలో ఇబ్బందులు తగ్గడంతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.