రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు
భక్తి
రొంపిచర్ల: మండలంలోని అన్ని గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజైన సోమవారం వైభవంగా జరిగాయి. ఆయా గ్రామాల్లోని ఆలయాలను భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రొంపిచర్లలోని బ్యాంక్ సెంటర్‌లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కౌమారి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తూర్పు బజారులోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు కార్యాయిణి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాత్రి వేళ ఆలయ ప్రాంగణాల్లో భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.