BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 09:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగోలులో భక్తిభావంతో నగర సంకీర్తన..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 09:00 AM
42 వీక్షణలు

సత్యసాయి జయంతి వేడుకలకు ఏర్పాట్లు లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ వీధివీధినా భగవన్నామ స్మరణ ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలులో ఆదివారం సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని శివాలయం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. భక్తులు భగవన్నామ స్మరణతో గ్రామ వీధులను ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. ఈ సందర్భంగా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, శ్రీరామ, జయరామ, జయ జయ రామ నామాలను ఆలపిస్తూ భక్తులు సంకీర్తనలో పాల్గొన్నారు. లోకమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. పెనుగోలులో అభయాంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణం పెనుగొలులోని బొడ్రాయి సెంటర్ వద్ద కొలువైన అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భజన బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు భక్తిప్రపత్తులతో సాగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి వివిధ రకాల ప్రసాదాలను నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి నామస్మరణతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహక కమిటీ సభ్యులు బొలగాని నాగయ్య, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పర్యవేక్షించారు.