BREAKING
thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం
Date of Publish : 06 October 2026, 01:06 pm
Posted by : SEETHA KIRAN KUMAR

GWMCలో ఇంటి అసెస్‌మెంట్‌పై భిన్న ఉత్తర్వులు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Oct, 2026 - 01:06 PM
4 వీక్షణలు

వరంగల్: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GWMC) కాశీబుగ్గ సర్కిల్‌-1 పరిధిలోని ఓ ఇంటి యాజమాన్యానికి సంబంధించి ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు భిన్నమైన ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత ఇంటి అసెస్‌మెంట్‌ను రద్దు చేస్తూ 2021లో అప్పటి అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, 2025లో హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేసినట్లు బాధితురాలు తెలిపారు.

హైకోర్టు ఆదేశాల అనంతరం వ్యవహారంపై విచారణ చేపట్టిన ప్రస్తుత డిప్యూటీ కమిషనర్‌ 2026లో పలు పత్రాలను పరిశీలించి, ఇంటికి సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు, ప్రస్తుత అధికారి ఇచ్చిన ఉత్తర్వులకు మధ్య వ్యత్యాసం ఉండటంపై చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వ్యవహారంపై GWMC కమిషనర్‌ సమగ్రంగా విచారణ జరిపి, రికార్డులు మరియు న్యాయస్థాన ఆదేశాలను పరిశీలించి న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. అధికారుల ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.