హనుమకొండ కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ: హనుమకొండ కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం నిర్వహించారు. దిశా కమిటీ చైర్‌పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్చి 7న నిర్వహించిన దిశా కమిటీ సమావేశం మినిట్స్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు.
వ్యవసాయం, ఉద్యానవనం, విద్య, వైద్యం, రోడ్డు భద్రత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా అందు