BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 13 October 2026, 11:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆస్పత్రుల్లో చికిత్సల ధరల ప్రదర్శన తప్పనిసరి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 11:39 AM
8 వీక్షణలు

ఆస్పత్రుల్లో చికిత్సల ధరల ప్రదర్శన తప్పనిసరి!

ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషలోనూ రేట్లు వెల్లడించాలి

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో అందించే చికిత్సలకు సంబంధించిన ధరలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రతి చికిత్సకు సంబంధించిన ధరల వివరాలను ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది.

ఈ నిబంధన అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చికిత్సల ఖర్చులపై రోగులకు ముందుగానే అవగాహన కల్పించడం, బిల్లుల విషయంలో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

చికిత్సల ధరలు బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా వైద్య ఖర్చుల విషయంలో పారదర్శకత పెరుగుతుందని, రోగులు, వారి కుటుంబ సభ్యులకు చికిత్సకు అయ్యే వ్యయంపై స్పష్టత లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.