దసరా సెలవుల్లో విద్యార్థుల అభ్యాసానికి ‘క్లాస్‌రూమ్ ఇంగ్లీష్’ పుస్తకాల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, ఏ. కొండూరు మండలం కోడూరు: దసరా సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనే ఉద్దేశంతో కోడూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. రాం ప్రదీప్ తాను రచించిన ‘క్లాస్‌రూమ్ ఇంగ్లీష్’ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దసరా సెలవుల్లోనూ విద్యార్థులు పుస్తకాలను చదువుతూ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ కె. ప్రేమ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ జె. సుజాత, పాఠశాల సిబ్బంది బి. నాగేంద్రరావు, వి. తేజస్విని, వి. జయశ్రీ, టీ. సుప్రియ, కమిటీ సభ్యురాలు సి.హెచ్. ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.