BREAKING
thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే
Date of Publish : 30 September 2026, 08:00 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
30 Sep, 2026 - 08:00 PM
8 వీక్షణలు

విజయవాడ, సెప్టెంబర్ 30: విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలకు వేదికపై ఇళ్ల పట్టాలను అందజేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు వారికి ఆస్తిపై శాశ్వత హక్కు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల ద్వారా పేద కుటుంబాలకు భూమిపై హక్కు కల్పించడంతో పాటు వారి నివాస భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.