హాజీపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
హనుమంతునిపాడు
హనుమంతునిపాడు: మండలంలోని హాజీపురం గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు తాతపూడి బుజ్జి లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తాతపూడి బుజ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పెన్షన్ మొత్తాన్ని అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.