జంగాలపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
మర్రిపూడి: మండలంలోని జంగాలపల్లిలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.