బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
బనగానపల్లె: బీసీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తేదీన బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 మంది గర్భిణీలకు పోషకాహారం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
“తల్లి ఆరోగ్యం.. బిడ్డ భవిష్యత్తు.. మనందరి బాధ్యత” అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గర్భిణీలకు పోషకాహారం అందించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రతి నెలా నిర్ణీత తేదీన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గర్భిణీలకు పోషకాహారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.