BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 18 November 2026, 05:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడివాడలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 05:18 AM
7 వీక్షణలు

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు 

గుడివాడ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు గురువారం గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ చేపట్టిన ఏర్పాట్లతో పాటు పోలీసు భద్రతా చర్యలను సమీక్షించారు. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.