BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి రూ.10,116 విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Nov, 2026 - 06:03 PM
19 వీక్షణలు

పెనుగొలను మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి రూ.10,116 విరాళం భక్తిభావంతో ముందుకొచ్చిన శీలం రామిరెడ్డి, సంధ్య దంపతులు.. దాతలను సత్కరించిన ఆలయ అర్చకులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దులో కొలువుదీరిన మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి భక్తులు తమ వంతు సహకారం అందిస్తూ ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోపాలదేవబోయినపల్లి (బోడిమెల్ల) గ్రామానికి చెందిన శీలం రామిరెడ్డి, సంధ్య దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి రూ.10,116 విరాళంగా అందజేశారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించిన శీలం రామిరెడ్డి, సంధ్య దంపతులు, వారి పిల్లలు శ్రీధరణి చిన్మయి, శ్రీరామచంద్రారెడ్డిలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారంగా రూ.10,116 నగదును ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు అందజేశారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని విరాళం అందించిన దాతలకు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు శ్యామ్ సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రోచ్ఛారణల మధ్య దాతలను ఆశీర్వదించి, శేషవస్త్రం కప్పి ఘనంగా సత్కరించారు. స్వామివారి కృపాకటాక్షాలు దాతల కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయానికి భక్తితో విరాళం అందించి ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములైన శీలం రామిరెడ్డి కుటుంబానికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి భక్తులు, దాతలు అందించే సహకారం ఎంతో విలువైనదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.