చిట్టాబత్తుని వనమ్మ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
మధుకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్సార్‌సీపీ నాయకులు
కనిగిరి: కనిగిరి పట్టణానికి చెందిన చిట్టాబత్తుని వనమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వనమ్మ నివాసానికి వెళ్లి ఆమె కుమారుడు మధును పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వనమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్, చింతగుంట్ల సాల్మన్ రాజు, యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి, రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్, సిరుప గోవర్ధన్ రెడ్డి, పులి శ్రీనివాసులు రెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, దర్శి సుబ్రహ్మణ్యం, దర్శి ఫణి కుమార్, సానికొమ్ము మధుసూదన్ రెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, యర్రబల్లి దేవరాజు, అయిమల్ల నాగమణి, చింతకుంట్ల కిషోర్ బాబు, పలుకూరి భాస్కర్, షేక్ నెంబర్ షరీఫ్, వంకదారి రాజా, చింతలపూడి చెంచులు, జగదాభి రాజు, షేక్ నాగర్ వలి, షేక్ కరిముల్లా, షేక్ రెహమాన్, షేక్ మీరావళి, సయ్యద్ నాయబ్ రసూల్, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, తమ్మినేని రమణారెడ్డి, షేక్ షకీల, సుస్మిత, కరాటపు రాజారావు, యర్రబల్లి ఆంటోని, ముద్దా పౌలు తదితరులు పాల్గొన్నారు.