BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 08:19 PM
51 వీక్షణలు

87 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: గంపలగూడెం శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 87 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమలోని సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు. వివిధ అంశాలపై అందమైన చిత్రాలను గీసి వాటికి రంగులు అద్దుతూ ఆకట్టుకునేలా తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి వారి విజ్ఞానాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి జ్యోతిర్మయి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో పఠనాసక్తిని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర నాయకుల సేవలు, వారి పోరాట పటిమ గురించి విద్యార్థులకు తెలియజేశారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, గ్రామ పెద్దలు, విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.