ఓల్డ్ బీట్ బజార్‌లో 15 రోజులుగా తాగునీటి వృథా
తెలంగాణ
/
హన్మకొండ
వరంగల్: వరంగల్ ఓల్డ్ బీట్ బజార్ ప్రధాన రోడ్డులో మంచినీటి పైపులైన్ లీకేజీతో గత 15 రోజులుగా తాగునీరు వృథాగా మురుగు కాలువల్లోకి చేరుతోంది. లీకేజీ కారణంగా నీరు రోడ్డుపైకి రావడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు.
పైపులైన్ నుంచి నిరంతరం నీరు లీక్ అవుతుండటంతో పెద్ద మొత్తంలో తాగునీరు వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు, దుకాణాలకు వచ్చే వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టలేదని స్థానికులు పేర్కొన్నారు. విలువైన తాగునీరు వృథా కాకుండా అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ లీకేజీని మరమ్మతు చేయాలని, రోడ్డుపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు.