BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 04:32 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చీర్లదిన్నె సర్పంచ్ అభ్యర్థిగా ద్వారశల విజయలక్ష్మి ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
14 Nov, 2026 - 04:32 PM
16 వీక్షణలు

పార్టీ శ్రేణులతో సమావేశమైన డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్.. సమష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపు

కనిగిరి: స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం కనిగిరి మండల పార్టీ అధ్యక్షుడు మడతల కస్తూరిరెడ్డి ఆధ్వర్యంలో చీర్లదిన్నె పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీ పరిధిలోని రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం నాయకులు, కార్యకర్తల అంగీకారం మేరకు చీర్లదిన్నె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ద్వారశల విజయలక్ష్మి పేరును డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు.

దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే భావనతో నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేస్తూ పార్టీ అభ్యర్థి విజయానికి కీలక పాత్ర పోషించాలని అన్నారు.

పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని, జగనన్న 2.0లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో విభేదాలకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ద్వారశల చిన్న వెంకటరెడ్డి, కొండారెడ్డి, బాలకృష్ణ, కొప్పర్తి నాగిరెడ్డి, అట్లా లక్ష్మీరెడ్డి, అట్లా రమణారెడ్డి, అట్లా రవీంద్ర, పోలంరెడ్డి నారాయణరెడ్డి, చెన్నూరు ప్రభుదాస్, మంగళం ఆదం, చెన్నూరు చిన్నయ్య, చెన్నూరి అరుణ్, పాముల వెంకటసుబ్బయ్య, ఎడమకంటి మల్లికార్జున, అట్లా వెంకటరామిరెడ్డి, మార్తాల రమణారెడ్డి, కర్నాటి వెంకటరెడ్డి, కొప్పర్తి జయరాములు, గుండా ఓబులు, అట్లా రామచంద్రరెడ్డి, సింక్‌రెడ్డి పరశురాం, గజ్జల ఎర్రరెడ్డి, కొప్పర్తి శ్రీరాములు, గజల్ బ్రహ్మయ్య, మార్తాల చిన్న గురుస్వామి, బూసుపల్లి పెద్ద మాలకొండయ్య, బూసుపల్లి చిన్న మాలకొండయ్య, రామభద్రపు ఏజాక్, ద్వారశల శేశిరెడ్డి, అట్లా కొండారెడ్డి, కోలనిడి చిన్న సూరి, అట్లా పిచ్చిరెడ్డి, అట్లా ఓబుల్‌రెడ్డి, అట్లా సంజీవరెడ్డి, ముంగర ఏసోబు, ఒప్పొత్తి నారాయణరెడ్డి, రామభద్రపు రాజేష్, రామభద్రపు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.