తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ వాయిదా
ఆంధ్రప్రదేశ్
కోర్టు కేసుల కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
తాడిగడప మున్సిపాలిటీతో పాటు గుడివాడ మున్సిపాలిటీకి ప్రస్తుతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత షెడ్యూల్లో ఈ రెండు మున్సిపాలిటీలను చేర్చలేదు.
కోర్టు పరిధిలో ఉన్న వివాదాల కారణంగా తాడిగడప, గుడివాడతో పాటు రాష్ట్రంలోని మరో 18 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లకు తొలి విడత ఎన్నికల షెడ్యూల్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
సంబంధిత కోర్టు కేసులు పరిష్కారం అయిన అనంతరం తదుపరి విడతలో ఈ మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది.