BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 09:59 am
Posted by : K MAHESH

నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. హనుమంతునిగూడెం పాఠశాల పునర్నిర్మాణ పనులు ప్రారంభం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 09:59 AM
29 వీక్షణలు

TP JAC ప్రాతినిధ్యానికి జిల్లా కలెక్టర్ స్పందన.. 122 మంది విద్యార్థులకు ప్రయోజనం

మహబూబాబాద్ (ఎన్ టుడే న్యూస్): నాలుగేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు హనుమంతునిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TP JAC) పలుమార్లు చేసిన ప్రాతినిధ్యాలపై జిల్లా కలెక్టర్ స్పందించి, గతంలో కాంట్రాక్టర్ ఖర్చు చేసిన రూ.21.80 లక్షల బిల్లులను మంజూరు చేయడంతో నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. ఈ పాఠశాలలో చదువుతున్న 122 మంది విద్యార్థులకు ఈ చర్యతో ప్రయోజనం కలగనుంది.

సుమారు 1960కు పూర్వం నుంచే పాత బజార్ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ పాఠశాల ఎక్కువకాలం అద్దె భవనాల్లోనే నిర్వహించబడింది. ప్రస్తుతం మండల అభివృద్ధి కార్యాలయం సమీపంలో ఉన్న పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో అధికారులు దానిని ఖాళీ చేయించారు. దీంతో విద్యార్థులను సమీపంలోని మరో పాఠశాలకు తరలించాల్సి వచ్చింది.

2022లో అప్పటి ప్రభుత్వం ‘మన ఊరు – మనబడి’ పథకం కింద రూ.62 లక్షల అంచనా వ్యయంతో నూతన పాఠశాల భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే కాంట్రాక్టర్ రెండు స్లాబుల నిర్మాణం చేపట్టిన తర్వాత, అప్పటివరకు ఖర్చు చేసిన సుమారు రూ.21.80 లక్షల బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో నాలుగేళ్లుగా భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.

ఈ సమస్యపై TP JAC అక్టోబర్ 2025 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ప్రజావాణిలోనూ ఫిర్యాదులు అందజేసింది. పాఠశాల పరిస్థితిని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

TP JAC చేసిన ప్రాతినిధ్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, కాంట్రాక్టర్ గతంలో వెచ్చించిన రూ.21.80 లక్షలను మంజూరు చేయడంతో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైనట్లు కమిటీ వెల్లడించింది. పాఠశాల పునర్నిర్మాణానికి స్పందించిన జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు TP JAC కృతజ్ఞతలు తెలిపింది.

ఇదే విధంగా జిల్లాలో అదనపు తరగతి గదులు, పాఠశాల భవనాలు అవసరమైన కంబాలపల్లి, జమాండ్లపల్లి, రామన్నపేట ఎస్టీ కాలనీ, పాత తండా, పత్తిపాక, బ్రహ్మంగారి తండా తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు కూడా తక్షణమే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని TP JAC విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రకటనపై TP JAC కన్వీనర్ మామిడాల సత్యనారాయణ, రాష్ట్ర కో-కన్వీనర్ మైస శ్రీనివాసులు స్పందించారు. జిల్లా కో-కన్వీనర్లు ఎస్.కె. జానీ, బుర్ర గోవర్ధన్, బి. శ్రీనివాసరెడ్డి, రాజమణి, లింగ్యా, లక్ష్మయ్య, చైతన్య తదితరులు ఈ ప్రకటనలో పాల్గొన్నారు.