BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 10 October 2026, 09:31 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

వెంకట్రావుపేటలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
10 Oct, 2026 - 09:31 PM
284 వీక్షణలు

లక్షెట్టిపేట: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని వేపాల్ భక్త మండలి ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల సందడి, బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకోవడం విశేషంగా నిలిచింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.. ఆడపడుచుల ఆనందానికి చిరునామా బతుకమ్మ! అనే సందేశంతో వెంకట్రావుపేటలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.