BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 09:02 pm
Posted by : KOLA MAHESH

ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
06 Oct, 2026 - 09:02 PM
11 వీక్షణలు

ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి - ఏఐటీయూసీ 

యాదాద్రి జిల్లా: భువనగిరి: 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, పెండింగ్‌ బకాయిల సాధన, కార్మిక సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఐక్య కూటమి ఎంప్లాయిస్ యూనియన్, టిఎంయూ, ఎన్ఎంయు  అభ్యర్థులను గెలిపించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి బోలగాని సత్యనారాయణ ఎండి ఇమ్రాన్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

     ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆధ్వర్యంలో భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కలిసి ఎన్నికల నేపథ్యంలో వారి సమస్యలు, సంఘాల కార్యాచరణ, భవిష్యత్‌ డిమాండ్లపై నాయకులు వివరించారు. డ్రైవర్లు–కండక్టర్లు, మహిళా కండక్టర్లు సిబ్బందికి ప్రత్యేకమైన వసతుల కోసం మరియు గ్యారేజీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారం కోసం సంఘాల ద్వారా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని బోలగాని సత్యనారాయణ, ఎండీ ఇమ్రాన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల కార్యక్రమం, కార్మికుల సమస్యలపై వారి వైఖరి, గతంలో నిర్వహించిన పోరాటాలను పరిశీలించి తమ నిర్ణయం తీసుకోవాలని కార్మికులకు సూచించారు.

      ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంగ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు గనబోయిన వెంకటేష్,  జిల్లా కోశాధికారి సామల శోభన్ బాబు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వడ్డేబోయిన సంతోష, రమేష్, తిరుపతి రెడ్డి, కృష్ణ, రాములు, స్వామి తదితరులు పాల్గొన్నారు.