BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:08 am
Posted by : K MAHESH

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:08 AM
17 వీక్షణలు

సంజీవని ఆశ్రమంలో ఘనంగా బాలల వారోత్సవాల ప్రారంభం.. చిన్నారులతో సరదాగా గడిపిన కలెక్టర్

నర్సంపేట: బాలలందరికీ సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. ప్రతి చిన్నారికి సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బాలల వారోత్సవాలు నర్సంపేటలోని సంజీవని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ మోహన్ రావు, వినోద దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంజీవని ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి బాలల వారోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.

అనంతరం జిల్లా సంక్షేమ అధికారిణి రాజమణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. బాలల భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. బాలలపై జరిగే వివక్ష, నిర్లక్ష్యాన్ని నివారించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రతి బాలుడికి విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రతతో కూడిన వాతావరణం కల్పించినప్పుడే వారు సమాజంలో బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారని తెలిపారు.

ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి మాట్లాడుతూ బాలల అభివృద్ధి, సంక్షేమం, విద్యాభివృద్ధి, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. చిన్నారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

బాలలతో కలెక్టర్ సరదా సందడి.. విజేతలకు బహుమతులు

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సంజీవని ఆశ్రమంలోని చిన్నారులతో సరదాగా గడిపారు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు కోకో, కబడ్డీ, వ్యాసరచన, లెమన్ స్పూన్ తదితర పోటీలను నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనగా, విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలతో ముచ్చటిస్తూ వారిని ప్రోత్సహించారు.

అదేవిధంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ కిరణ్, డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం నిర్వాహకురాలు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) బత్తిని కళ్యాణి, బాలల సంక్షేమ సమితి సభ్యులు షాహిదా బేగం, మధు, తహసీల్దార్ దేవేందర్, సీడీపీఓలు మధురిమ, జ్యోతి, షేర్ ఎన్జీవో కోఆర్డినేటర్ శిరీష, సీహెచ్ఎల్ కేస్ వర్కర్ ఎన్. మౌనిక, డీసీపీయూ ఔట్రీచ్ వర్కర్ రాజుల సుమన్, సంజీవని ఆశ్రమం నిర్వాహకులు రమ, జ్యోతి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, బాలలు తదితరులు పాల్గొన్నారు.