BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో నిద్రావస్థలో ఎక్సైజ్ శాఖ.. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:35 PM
4 వీక్షణలు

 బైపాస్ రోడ్డులో యథేచ్ఛగా అమ్మకాలు.. మహిళల భద్రతకు ముప్పు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు పట్టణంలో ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వేళల్లో మద్యం విక్రయాలపై నియంత్రణ కొరవడటంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బైపాస్ రోడ్డులో రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు అమ్మకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రాత్రి వేళ బస్సుల్లో ప్రయాణించి తిరువూరు చేరుకునే ప్రయాణికులు ఈ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సుందరి కాలనీ, ధారా పోనే టౌన్‌షిప్ ప్రాంతాలకు వెళ్లే మహిళలు బస్సు దిగి ఇళ్లకు చేరుకునే సమయంలో భయాందోళనలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డులో రాత్రి వేళ మద్యం విక్రయాలు, మందుబాబుల సంచారం కారణంగా మహిళలకు భద్రత లేకుండా పోతోందని చెబుతున్నారు. మరోవైపు సమస్యపై స్పందించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని, కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరువూరులో ఎక్సైజ్ శాఖ నిర్వహణ తీరు, రాత్రి వేళ తనిఖీలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వేళ అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని నిలదీస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసు శాఖ తక్షణమే స్పందించి బైపాస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే రాత్రి వేళ పోలీసు గస్తీ పెంచి మహిళలు భయంలేకుండా ఇళ్లకు చేరుకునేలా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరువూరులో ఎక్సైజ్ శాఖ ఇప్పటికైనా స్పందించి తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది

.