ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
చిత్తూరు: ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తనిఖీల సమయంలో తొమ్మిది క్వార్టర్ మద్యం సీసాలను కూడా గుర్తించినట్లు సమాచారం. వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిసింది.
ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, అనుమానాస్పద రవాణాపై నిఘా ఉంచడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.