BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మున్సిపల్ ఉద్యోగులకు త్వరలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 09:46 PM
2 వీక్షణలు

మున్సిపల్ ఉద్యోగులకు త్వరలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం ఉద్యోగుల హాజరులో పారదర్శకతకు పెద్దపీట

కడప: మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య ఉద్యోగుల హాజరు నమోదులో పారదర్శకతను పెంపొందించేందుకు త్వరలో ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చిరుకూరి ఆదేశాల మేరకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉద్యోగుల హాజరును పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా జీతభత్యాల చెల్లింపు ప్రక్రియను నిర్వహించనున్నట్లు వివరించారు. ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా ఉద్యోగుల ముఖ గుర్తింపుతో హాజరు నమోదు చేయనున్నారు. ఈ విధానం అమలుతో ఉద్యోగుల హాజరులో పారదర్శకత పెరగడంతో పాటు విధుల నిర్వహణలో సమయపాలన, పరిపాలనలో జవాబుదారీతనం మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే పారిశుధ్య పనుల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మున్సిపల్ పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.