BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 11:13 am
Posted by : PARSIKA KAMESH

చింతూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని యువకుడు మృతి

ఆంధ్రప్రదేశ్
/ పోలవరం
15 Nov, 2026 - 11:13 AM
104 వీక్షణలు

అటవీశాఖ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల యువకుడు

చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అటవీశాఖ కార్యాలయం ఎదుట వేగంగా దూసుకొచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

వీఆర్‌పురం మండలం చింతరేగుపల్లి గ్రామానికి చెందిన ముత్యాల రాజ్‌కుమార్ (22) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద తీవ్రతకు అతని తలకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.

పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఈ ప్రమాదం జరగడంతో సమాచారం అందుకున్న చింతూరు ఎస్‌ఐ సంతోష్ కుమార్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

22 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చింతరేగుపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.