BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఎరువుల కొనుగోలుకు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:07 PM
30 వీక్షణలు

రైతులు ఆధార్‌తో నమోదు చేసుకుని క్యూఆర్ కోడ్ ద్వారా ఎరువులు పొందాలి: మండల వ్యవసాయ అధికారి 

చాట్రాయిలో ఎరువుల కొనుగోలుకు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ తప్పనిసరి రైతులు ఆధార్‌తో నమోదు చేసుకుని క్యూఆర్ కోడ్ ద్వారా ఎరువులు పొందాలి: మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఏలూరు జిల్లా, నవంబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూపొందించిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని ఎరువులు పొందాలని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. మంగళవారం చాట్రాయి మండలంలోని రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) వద్ద ఎరువుల విక్రయ డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కార్యదర్శులు, గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులకు యాప్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు తమకు అవసరమైన ఎరువులను ముందుగా ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో నమోదు చేసుకుని పొందాలని తెలిపారు. రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్ వివరాలతో లాగిన్ కావాలని సూచించారు. అనంతరం యాప్‌లో కనిపించే తమ పంట వివరాలను పరిశీలించి, సరిచూసుకుని అవసరమైన ఎరువుల వివరాలను రైతులే నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. రైతులు తమ వ్యవసాయ భూమి సర్వే నంబర్ ఆధారంగా ఎరువులను నమోదు చేసుకున్న తర్వాత వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ అందుతుందని తెలిపారు. ఆ క్యూఆర్ కోడ్‌ను వినియోగించి తమకు అనుకూలమైన ఎరువుల డీలర్ వద్ద లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నమోదు చేసుకుని ఎరువులు పొందవచ్చని వెల్లడించారు. యాప్ వినియోగంలో రైతులకు ఎలాంటి సందేహాలు, సాంకేతిక సమస్యలు ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న గ్రామస్థాయి వ్యవసాయ అధికారులు సహకారం అందిస్తారని తెలిపారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీలర్లు, పీఏసీఎస్ కార్యదర్శులు, వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.