BREAKING
thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు
Date of Publish : 30 September 2026, 06:10 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ప్రకృతి వైపరీత్యాల్లో మృతిచెందిన YSRCP కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
30 Sep, 2026 - 06:10 PM
15 వీక్షణలు

తాడేపల్లి, సెప్టెంబర్ 30: ప్రకృతి వైపరీత్యాల్లో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సహాయాన్ని అందించనున్నట్లు పేర్కొంది.


ఈ ఆర్థిక సహాయం ప్రకృతి వైపరీత్యాల్లో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందని పార్టీ స్పష్టం చేసింది.


ఆర్థిక సహాయం కోసం కొన్ని నిబంధనలను పార్టీ వెల్లడించింది. సంఘటనకు సంబంధించి పోలీసుల ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం నివేదిక తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే సంబంధిత గ్రామం లేదా వార్డు పార్టీ అధ్యక్షుడి సిఫార్సు అవసరమని పేర్కొంది.


అర్హులైన కుటుంబాలు బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.


ఈ మేరకు సెప్టెంబర్ 30న తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.