BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 18 November 2026, 05:14 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం మాజీ ఎమ్మార్వో రాజుకు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు.. ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 05:14 AM
9 వీక్షణలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రాజుకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రముఖ సినీ నటుడు సుమన్, తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకుని ఘన సత్కారం పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన సుదీర్ఘ సేవా కాలంలో ప్రజలకు అందించిన సేవలు, నిర్వహించిన బాధ్యతలకు గుర్తింపుగా రాజుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు కార్యక్రమంలో ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సేవలందించి పదవీ విరమణ పొందిన రాజుకు ఇలాంటి గౌరవం దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో రాజు అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు అందుకోవడం సంతోషకరమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన గౌరవాలు పొందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి మంచి గుర్తింపు పొందిన రాజును సత్కరించడం ఆనందంగా ఉందని ప్రశంసించారు. ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో రాజు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది. పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన రాజుకు లభించిన ఈ గౌరవం ఆయన ఉద్యోగ జీవితానికి గుర్తింపుగా నిలిచింది

.