గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడిని దర్శించుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వినాయక యూత్ సభ్యులు మైల నర్సింహ్మ, మహేష్, ప్రశాంత్, శివ, సాయి, వంశీతో పాటు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.