ధర్మపురి క్షేత్రంలో ఉచిత అన్నప్రసాద వితరణ ప్రారంభం
ధర్మపురి క్షేత్రంలో ఉచిత అన్నప్రసాద వితరణ ప్రారంభం
- మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
- అమావాస్య అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ గోదావరి నది తీర ప్రాంతంలో అమావాస్య సందర్భంగా "అమావాస్య అన్నప్రసాద సేవా సమితి" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి శనివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు, పేదలకు అన్నప్రసాదం అందించడం ఎంతో పుణ్యకార్యమని కొనియాడారు. సేవ నిరతితో ముందడుగు వేసిన "అమావాస్య అన్నప్రసాద సేవా సమితి" సభ్యుల సేవాభావాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతి అమావాస్యకు అన్నదానం:
ఇకపై ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు, స్థానిక ప్రజలకు నిరంతరంగా అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు సేవా సమితి నిర్వాహకులు వెల్లడించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పిన్న శ్రీనివాస్, సాయిని శ్రీనివాస్, సేవా సమితి ప్రతినిధులు, సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.