గణేష్ మండపాలకు ఉచితంగా ప్రచార సామగ్రి పంపిణీ
పల్నాడు జిల్లా, రొంపిచర్ల:
రొంపిచర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రచార సామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇందులో భాగంగా సోమవారం రొంపిచర్ల, రామిరెడ్డిపాలెం గ్రామాల్లోని గణేష్ మండపాల నిర్వాహకులకు జెండాలు, బ్యానర్లు, పాంప్లెట్లు, కండువాలను అందజేశారు. ప్రతి గ్రామంలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా ప్రచార సామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా గ్రామాల్లో భక్తిభావం, ధార్మిక చింతన పెంపొందించేలా నిర్వహించాలని కోరారు. గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజల్లో ఐక్యతను చాటిన స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని ప్రతి గణేష్ మండపంలో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య నాయకులు గొడవర్తి వెంకటేశ్వర్లు, అర్వపల్లి విశ్వేశ్వరరావు, కట్టమూరు పేరయ్య, పేరేచర్ల కోటేశ్వరరావు, కొండలు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.