BREAKING
thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్
Date of Publish : 01 October 2026, 11:30 am
Posted by : A. MURALIDHAR

కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
01 Oct, 2026 - 11:30 AM
10 వీక్షణలు

అన్నమయ్య జిల్లా / ఎన్ టుడే న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలో కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేసి వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేసి డిపోలకు అందుబాటులోకి తీసుకువచ్చిన అనంతరం వాటిలో ఉచిత ప్రయాణ సేవలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అయితే సూపర్ లగ్జరీ, అంతర్రాష్ట్ర, తిరుమల సప్తగిరి బస్సులకు ‘స్త్రీ శక్తి’ పథకం వర్తించదని అధికారులు తెలిపారు.

మహిళలకు ప్రజా రవాణా సౌకర్యాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా కొత్త ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించింది.