BREAKING
thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
Date of Publish : 06 October 2026, 08:11 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

వెల్గటూర్‌లో ఘనంగా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
06 Oct, 2026 - 08:11 AM
2 వీక్షణలు

వెల్గటూర్: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) ప్రజా సేవలు చిరస్మరణీయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు సోమవారం వెల్గటూర్ మండల కేంద్రంలో గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.


కార్యక్రమంలో భాగంగా ముందుగా గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎంపీపీ ఎండీ. రజియా బషీర్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు.


ఈ సందర్భంగా తాటిపర్తి శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగి రెండుసార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర కార్మిక, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా పనిచేశారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో డిప్యూటీ మంత్రిగా, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో సహాయ మంత్రిగా, కేంద్ర టెక్స్టైల్స్, కార్మిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు.


సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం వెంకటస్వామి చేసిన కృషిని శైలేందర్ రెడ్డి ప్రస్తావించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలు ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు.


కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గుండాటి సందీప్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్, కోటిలింగాల టెంపుల్ డైరెక్టర్లు బుద్దె రవి, రాపాక రాయకోటయ్య, గుమ్ముల వెంకటేష్, ఏఎంసీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్, దావుల శశి, రామిల్ల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ బొప్పు తిరుపతి, భూపతి నరేష్, గుమ్ముల అజయ్, వెలగందుల సంతోష్, బరుపటి జనార్ధన్, మన్నే జితేందర్, పాకాల నరేష్, రత్నాకర్, బరుపటి మహేష్, కొత్త రవి, నలమళ్ల సురేష్, కంటెం ప్రవీణ్, కంటెం మధు, కంటెం రాజు, అల్లం సంతోష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.