తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: తెలంగాణ రక్షణ సేన వరంగల్ విద్యార్థి జిల్లా నాయకుడు పోగుల సుతేజ్ ఆధ్వర్యంలో కరీమాబాద్‌కు చెందిన గజ్జెల శివ తెలంగాణ రక్షణ సేనలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన పార్టీలో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గజ్జెల శివ మాట్లాడుతూ.. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ లక్ష్యాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.