BREAKING
thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి
Date of Publish : 03 October 2026, 08:46 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
03 Oct, 2026 - 08:46 AM
7 వీక్షణలు

మండల పరిషత్ కార్యాలయములో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎంపిడిఓ పి.వి.ఆర్.కె.రాజు మరియు పరిపాలనాధికారి శ్రీ వి.రామ స్వరూప్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, అహింసా మార్గంలో స్వాతంత్ర్య సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపిడిఓ శ్రీ పి.వి.ఆర్.కె.రాజు మాట్లాడుతూ, “మహాత్మా గాంధీజీ మన దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, సత్యం, అహింస, శాంతి, సోదరభావం వంటి గొప్ప విలువలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన చూపిన అహింసా మార్గం, సత్యనిష్ఠ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ, ఆయన కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది అంగన్ వాడే సిబ్బంది మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.