తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో ఏ. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో ఏ. కుమార్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటాలు, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీ అనుసరించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.