BREAKING
thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం
Date of Publish : 02 October 2026, 11:44 am
Posted by : THALLAPALLI LAKSHMANA

గాంధీజీ ఆశయాలు ఆచరణీయమైనవి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
02 Oct, 2026 - 11:44 AM
16 వీక్షణలు

గాంధీజీ ఆశయాలు ఆచరణీయమైనవి: దద్దాల నారాయణ యాదవ్

కనిగిరి: మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ఆచరణీయమని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు.

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం కనిగిరి సబ్‌ ట్రెజరీ కార్యాలయ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని, సత్యం, అహింస, శాంతియుత పోరాటాల ద్వారా స్వాతంత్ర్య సాధనకు కృషి చేశారని పేర్కొన్నారు.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య భావనను 2019–2024 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిందని దద్దాల నారాయణ యాదవ్ పేర్కొన్నారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం ద్వారా గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.

గాంధీజీ సిద్ధాంతాలను కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా, దైనందిన జీవితంలో సత్యం, అహింస, శాంతి విలువలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి అని దద్దాల నారాయణ యాదవ్ అన్నారు.

కార్యక్రమంలో పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.