ఐక్యతకు ప్రతీకగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని 9వ వార్డులో రామదండు యువసేన ఆధ్వర్యంలో ఐక్యతకు ప్రతీకగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, అట్టహాసంగా నిర్వహించడం జరిగింది, ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో సాయికుమార్ - స్పందన దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదం అందజేయడం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని, స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో రామదండు యువసేన సభ్యులు, 9వ వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.